Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Raghunandan: సోనియా గాంధీ ఇంటికి ఎంపీ రఘునందన్

MP Raghunandan: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీజేపీఎంపీ రఘునందన్ (MP Raghunandan) రావు ఏఐసీసీ అగ్రనే త సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. ఢిల్లీలోని నివాసంలో వారిని కలిసేం దుకు ప్రయత్నించారు. రఘునంద న్ వెంట ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ (MLA Palvai Harish)ఉన్నారు. ఈసందర్భంగా రఘునం దన్ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ పౌరసత్వంపై బ్రిట న్ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథ నాలను సోనియా గాంధీ కార్యాల యంలో ఇచ్చాను. రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని సెక్యూ రిటీ చెప్పారు. దాంతో రిసెప్షన్ లో పత్రిక ఇచ్చి వచ్చాను. ఇదే విషయంపై నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ (Press meet)పెట్టీ చెప్పాను. బ్లిట్జ్ పత్రికలో వచ్చి న కథనాలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని తెలి పారు.