–ప్రమాదాల నివారణకు వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలి
–నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపిఎస్
SP Sarath Chandra Power: ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ పట్టణంలో చర్లపల్లి గ్రామ మధ్యలో నుండి రోడ్డు ఉన్నందున అక్కడి జంక్షన్ నుంచి పాదచారులు,వాహనదారులు ఇరువైపులా వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురి అవుతున్నారనే కారణంతో జిల్లా ఎస్పీ గారు NAM & R&B అధికారులతో సందర్శించి పరిశీలించి ప్రమాదాలు జరగకుండా, పాదాచారులు PGR రెలింగ్ ఏర్పాటు చేసి క్రమ పద్ధతిలో వెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సెంట్రల్ లైటింగ్,బ్లింకింగ్ లైటింగ్,జీబ్రా క్రాసింగ్ లైన్స్ ,వేగ నియంత్రణ (Central lighting, Blinking lighting, Zebra crossing lines, Speed control) సూచికలు పెట్టే విధంగా అధికారులకు సూచించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే,స్టేట్ హైవేల పైన యాక్సిడెంట్ ఫ్రోన్,బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన భారీ కేడ్లను, కీలకమైన కూడళ్ళ వద్ద లైటింగ్, స్పీడు నియంత్రణ కోసం మలుపుల దగ్గర సూచికలు, బ్లింకింగ్ లైట్స్, బోలర్స్ ఏర్పాటు చేస్తూ, ప్రమాదాల (Blinking lights, setting up bowlers, accidents) నివారణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు . రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నమని అన్నారు. వాహనదారులకు ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ డానియల్,రూరల్ ఎస్ఐ సైదా బాబు, డివిజనల్ ఇంజనీర్ R&B గణేష్ ఏ.ఈ దినేష్ NAM ఎస్ప్రెస్ రోడ్ ఇంజనీర్ మదార్, సాదుల్ల,డి.టి.ఆర్బి రిటైర్ సీఐ సిఐ అంజయ్య తదితరులు పాల్గోన్నారు.