–అక్రమ నిర్మాణాల అంతుచూస్తా మంటూ అంతకంతకు దూకుడు
–ఖరాఖండిగా రూల్ ఫర్ ఆల్ అంటోన్న రేవంత్ ప్రభుత్వం
–ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో అక్ర మ నిర్మాణాల జాబితా సిద్ధం
–తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం
–పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు మధ్య కూల్చిన హైడ్రా యంత్రాంగం
–చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామ ని హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథన్
ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధి కారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తు న పోలీసు బందోబస్తు నడుమ హై డ్రా (hydra)రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. నాగార్జునకు సం బంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు (hydra) ఫిర్యాదు అందింది. దీంతో తుమ్మిడి చెరువు ను ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధి కారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శని వారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు.కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ అక్రమ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశారు.
చెరువులను కబ్జా (Capture the ponds)చేసి అక్రమంగా నిర్మించిన భవ నాలన్నీ కూల్చేస్తామని చెప్పారు. దీంతో మాదాపూర్ లోని తమ్మిడి చెరువును కబ్జా చేసి మూడున్నర ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అధి కారులు పూనుకున్నారు. ఒకప్పు డు హైదరాబాద్ నగరం చెరువుల తో నిండి ఉండేది. కానీ సిటీ అభివృ ద్ధి పేరుతో నగరంలోని అనేక చెరు వులు కబ్జాలకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్ళ లో అంటే 197 9 నుంచి 2023 వర కూ నగర పరి ధిలోని చెరువుల స్థితి పై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటి లైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువు లకు సంబం ధించిన వివరాలను హై డ్రాకు హైద రాబాద్ డిజాస్టర్ రెస్పా న్స్ (Disaster Response) అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అందజేసింది. వా స్తవ విర్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో కూ డిన సమాచారాన్ని ఇచ్చింది. దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేప థ్యంలో ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలకు దిగింది.
ఆక్రమణల కదాకమీషు…
రూల్ ఫర్ ఆల్ అంటోంది రేవంత్ సర్కార్ (revanth). నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షిం చమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికా రులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌లో కొంతభాగం ఆక్రమిం చిందే. దాంతో ఆ నిర్మా ణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.10 ఎకరాల్లో నిర్మాణం హీరో నాగార్జున నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదా పూర్లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరు తో ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఇం దులో 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణా లు చేపట్టారు. ఇదే అంశం పై ప్రభు త్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఎఫ్టీఎల్ అంటే ఏమిటి .. చెరువు లేదంటే జలాశయంలో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్య పరిధిని ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) అంటారు. వర్షాకాలంలో నీటితో నిండితే లేదంటే వరద నీటితో నిండి తే ఎఫ్టీఎల్ నిర్ధారిస్తారు. హిమా యత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎఫ్ టీఎల్‌ను నిర్మాణ సమయంలో నిర్ధా రించారు. వర్షం లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తోంది. ఎఫ్ టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా సరే నీళ్లు లేని సమయంలో వ్యవసాయం చేసుకోవచ్చు. నీరు ఉంటే ఆ భూములను వదిలేయా ల్సి ఉంటుంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు (constrcutions)చేపట్టొద్దనే కఠిన నిబం ధన ఉంది.
బఫర్ జోన్ (buffer zone)అంటే ఏమిటి … నది పరీవాహక ప్రాంతంలోకి వరద నీరు సక్రమంగా వస్తూనే కలుషితం కాకుండా ఉండాలి. ప్రతి నీటి వన రును, విస్తీర్ణం ఆధారంగా బఫర్జో న్గా నిర్ధారిస్తారు. 25 హెక్టార్లు, అంత కుమించి విస్తీర్ణంలో ఉన్న చెరు వు, జలాశయాలు బఫర్‌జోన్ నిర్ధారణకు 30 మీటర్లను ప్రామాణి కంగా తీసుకుంటారు. జంట జలాశ యాల పరిధి చుట్టూ ఎఫ్టీఎల్ను ఆనుకొని 30 మీటర్లు (వంద ఫీట్లు) బఫర్‌జోన్‌గా ఉంది. ఇక్కడ సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్ర మే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. నాగార్జున ఎన్ కన్వెక్షన్‌లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ రెండు ఉన్నాయి. ఆ క్రమంలోనే హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ముమ్మాటికి అక్రమ నిర్మాణ మే ..హీరో నాగార్జున (nagarjuna)నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరు ద్ధంగా నిర్మించారు. 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2 రెండు ఎకరాల భూమి ఉంది. మొత్తం 3.12 ఎక రాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధం గా నిర్మించడంతో అక్రమ నిర్మాణాల ను హైడ్రా అధికారులు కూల్చి వేస్తు న్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామ న్న నాగర్జున(nagarjuna)… …స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకర మని నటుడు నాగార్జున పేర్కొ న్నారు. హైడ్రా (hydra)కూల్చివేతల పై ఆయన ట్విట్టర్ వేదికగా స్పం దించారు. తమ ప్రతిష్టను కాపా డటం కోసం, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు, చట్టాన్ని ఉల్లంఘించి తాము ఎటువంటి చర్యలు చేప ట్టలేదని చెప్పేందుకే ఈ వివరణ ఇస్తున్నట్టు చెప్పు కొచ్చారు. ఆ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.
కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కూడా స్టే ఉందని గుర్తు చేశారు. స్పష్టంగా చెప్పా లంటే, కూల్చివేత తప్పుడు సమా చారంతో లేదా చట్ట విరుద్ధంగా జరి గిందని పేర్కొన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కోర్టు తమ కు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూ ల్చివేత తానే నిర్వహించి ఉండే వాడినని వివరించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
అంతా అయిపోయాక హైకోర్టు స్టే ..తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు (nagarjuna) భారీ ఊరట లభిం చింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేత లు ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చిం ది. శనివారం ఉదయం హైదరాబా ద్‌లోని మాదాపూర్‌లో గల తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికా రులు కూల్చివేశారు. భారీ బందో బస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చి వేతలు జరిగాయి. ఈ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు లో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేత లపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరా రు. దీంతో హైకోర్టు (high court)ఈ కూల్చివేతల పై స్టే విధించింది.