Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Penaka Nehareddy: అది అక్రమం.. కూల్చాల్సిందే

–తీర్పు వెలువరించిన ఏపి హైకోర్టు
–భీమిలి బీచ్ వద్ద విజయసాయి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణం
— హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేత మూర్తి యాదవ్
–ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మా స‌నం కూల్చివేతకు అనుమతి

Penaka Nehareddy: ప్రజా దీవెన, విజ‌య‌వాడ‌: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijaya sai reddy)కుమార్తె పెనకా నేహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపం లో సీఆర్‌ జడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ ప్రహరీగోడ (Concrete retaining wall) విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికా రులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను సమర్పించాలని తెలిపిం ది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. హై కోర్టు (high court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమ లపాటి రవితో కూడిన ద్విసభ్య ధ ర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ను ఆశ్రయించిన జ‌న‌ సేన కార్పొరేట‌ర్‌ ..భీమిలి బీచ్ (Bhimili Beach)సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాం టి చర్యలు చేపట్టడం లేదని జన సేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్ వాదనలు విని పించారు. నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని, అయితే ఆ ఉత్తర్వుల ను సవాల్ చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జి (Nehareddy High Court Single Judge) వద్ద పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ పిటిషన్ పై సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనానికి తెలియ జేశారు. స్టే ఉత్తర్వులు లేనప్పుడు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసు కోవాలని ధర్మాసనం తేల్చి చెప్పిం ది.