Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amer Ali Khan: జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా

— ఎమ్మెల్సీ అమెర్ అలీ ఖాన్

Amer Ali Khan: ప్రజా దీవెన, హైదరాబాద్: ఓ పత్రికా సంపాదకుడిగా జర్న లిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సి, సియాసత్ ఉర్దూ దిన పత్రిక సంపాదకులు అమెర్ అలీ ఖాన్ (Amer Ali Khan)భరోసా ఇచ్చారు.తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీ వల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుక్రవారం బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాల యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు యాభై ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్ తో సంబంధం ఉందని, నాడు తన తాత ఆబిద్ అలీ ఖాన్, తండ్రి జహేద్ అలీ ఖాన్, నేడు తాను యూనియన్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపదవచ్చినా తనవంతు చేయూత అందిస్తానని అమెర్ అలీ ఖాన్ (Amer Ali Khan) హామీ ఇచ్చారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, సియాసత్ పత్రికా వ్యవస్థాపకులు ఆబిద్ అలీ ఖాన్ ఉమ్మడి రాష్ట్రంలోని తమ ఏపీయూడబ్ల్యూజే సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసారు. రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీలో తమ యూనియన్ ప్రతినిధిగా, ప్రెస్ అకాడమీ పాలకమండలి నియామక విధి విధానాల కమిటీ ఛైర్మన్ గా ఆయన కొనసాగారని విరాహత్ గుర్తుచేసారు. ప్రస్తుతం అమెర్ అలీ ఖాన్ (Amer Ali Khan) ఎమ్మెల్సిగా నియామకం కావడం ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవంగా తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, తెలంగాణ చిన్న మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.