— పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
Chandragiri Vilas Colony: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలోని శివారు కాలనీల పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తు న్నారు.తద్వారా సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్ రోడ్ లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో (Chandragiri Vilas Colony) రోడ్లపై పిచ్చి మొక్కలు పెరిగి నడకదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీంతో పాటు రోడ్లపైనే నాగుపాములు ఇతర ఇతర విష పురుగులు సంచరిస్తున్నాయి. అదేవిధంగా చెట్లపై కోతులు బెడదతో కాలని వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యల గురించి పురపాలక అధికారులకు (For municipal authorities)స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయింది.