‘Madhyam’ for a few more hours – వైన్స్ టెండర్ లకు నేడే గడువు మరికొన్ని గంటల వరకే ‘మద్యం’
-- వైన్స్ టెండర్ లకు నేడే గడువు
మరికొన్ని గంటల వరకే ‘మద్యం’
— వైన్స్ టెండర్ లకు నేడే గడువు
ప్రజా దీవెన /హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల వేలం దరఖాస్తుల గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది.
శుక్రవారం సాయంత్రంతో మద్యం టెండర్ల గడువు ముగియనుండగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 2,620 మద్యం షాపులకు గాను ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 615 వైన్స్ షాపులు ఉoడగా అధికారులు మొత్తం లక్ష అప్లికేషన్లు వస్తాయని అంచనా వేశారు.
కొత్త దరఖాస్తుల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు రూ.2వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో మద్యం షాపులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు ఊహించిన దానికంటే యమ స్పందన కానవస్తుంది. గురువారం సాయంత్రం వరకే 70 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు వసూలు చేస్తుండగా ప్రభుత్వం అనుకుంటున్నట్లు గా రూ. 2 వేల కోట్ల ఆదాయం దాదాపు సమకూరే అవకాశం ఉంది.