Krishna Janmashtami celebrations: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్ స్కూల్ (Master Mind School) లో కృష్ణ జన్మాష్టమి వేడుకలను (Krishna Janmashtami celebrations) సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారి విద్యార్థినీ, విద్యార్థులు కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో అలరించారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే వేడుకకు చిన్నారులు వేషధారణలో అందరిని ఆకట్టుకున్నారు.
పిల్లనగ్రోవితో చిన్నారులు ఆటా పాటలు (songs and games) అందరినీ అలరించాయి.అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్ పొట్ట కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కాలనీవాసులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
