AMLA: ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీయ ఆధ్యాత్మిక చింతనతో పాటు వైద్యంలోనూ ఉసిరికకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ ధర్మం ఉసిరిక చెట్టును పవిత్రంగా భావిస్తుంది. రోగాల బారి నుంచి కాపాడేందుకు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో కీలకమైన విటమిన్ ‘సి’ (Vitamin C)ఉసిరికలో అత్యధికంగా ఉంది. నారింజ పండులో కంటే దాదాపు 30 రెట్లు విటమిన్ సి ఇందులో ఉందంటే ఆశ్చర్యం కలిగించకమా నదు. విటమిన్ ‘సి’ లోపంతో వచ్చే చిగుళ్ల రక్తస్రావం, చిగుళ్లు రంగు మారడం వంటి వాటిని రోజూ ఉసి రిక ఆహారంలో తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.
కంటి చూపు కోసం:
కంటి దోషాలను ఉసిరిక గణనీయం గా తగ్గిస్తుంది. ఇందులో ఉన్న విట మిన్ ‘సి’ (Vitamin C)రెటీనాపై ప్రభావం చూపి సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. ఇం దులో విటమిన్ ‘ఏ’, ‘బి’ కాంప్లెక్స్ తోపాటు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ (Calcium, Phosphorus, Iron)కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫైబర్ కూడా ఇందులో తగినంతగా ఉంది.
పొట్టలో దోషాలకు:
జీర్ణ లోపాలను (Digestive disorders)సరిచేసి, జీర్ణవ్యవ స్థను మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరం నుంచి అదనపు నీరు, లవ ణాలను తొలగించేలా సాయపడు తుంది. ఇందులో ఉండే పీచు ఆకలిని తగ్గించి, తినే ఆహా రం మోతాదును కూడా క్రమేపీ క్రమ బద్దం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గి స్తుంది. ఫలితంగా సహజంగానే అధికబరువు తగ్గిపోతుంది. దీంతో మీరు చురుగ్గా తయారవుతారు.