–మల్టీపుల్ కౌన్సిల్ పాస్ట్ ఛైర్మెన్ తీగల మోహన్ రావు
Mohan Rao: ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రపంచం లో 220 దేశాల్లో కోట్లాది మందికి ని త్యం సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవ లం దిచడం అగ్రగామి ఉందని రాష్ట్ర మల్టిఫుల్ కౌన్సిల్ ఫాస్ట్ ఛైర్మెన్ తీగల మోహన్ రావు (Mohan Rao) అన్నారు. శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో శాలిగౌరారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ ఆసుపత్రి సహాకారం తో డాక్టర్ యానాల మోహన్ రెడ్డి సతీమణి శకుంతల జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిభిరం (Free Ophthalmology Camp), జోన్ ఛైర్మెన్ ఉప్పల వెంకటరమణ తండ్రి బాల నర్స య్య జ్ఞాపకార్థం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణి,ఆసుపత్రికి ఈసీజీ మిషన్ అందజేత, వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణి కార్యక్రమాలను తీగల మోహన్ రావు ప్రారంభించి మాట్లాడారు.
సమాజ సేవే పరామావదిగా లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యం పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.శాలిగౌరారం లయన్స్ క్లబ్ (Lions Club) వారు అనతి కాలంలోవిద్యార్థులకు,మహిళలకు,పేద ప్రజలకు సేవలతో పాటు ఆర్ధిక సాయం చేయడం లో ముందుం దన్నారు. ప్రతి వారం ఆసుపత్రి లో గర్భిణీ స్ట్రీలకు పౌష్టికాహారం అం దించడం గర్వకారణం అన్నారు. కంటి వైద్య శిభిరం లో 200 మందికి పరీక్షలు నిర్వహించి 26 మందిని ఆపరేషన్ కు చేయడానికి గుర్తిం చారు. కొoతమందికి కంటి అద్దా లు, మందులు పంపిణి చేశారు. అనంతరం శాలిగౌరారం లో నిర్వ హిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేం ద్రాన్ని,లయన్స్ భవన నిర్మానానికి సేకరించిన స్థలాన్ని మోహన్ రావు పరిశీలిoచారు.
ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ (Lions Club) జిల్లా 2వ గవర్నర్ కేవి ప్రసాద్,జిల్లా క్యాబినెట్ పాస్ట్ కోశా ధికారి దుబ్బాక వెంకట రెడ్డి,రీజన్ ఛైర్మెన్ గుడిపూడి వెంకటేశ్వరరావు, సూర్యాపేట కంటి ఆసుపత్రి ఆర్గ నైజర్ (Eye Hospital Organiser)ఉప్పల రాజేంద్రప్రసాద్,క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయ ణ,పాస్ట్ జోన్ ఛైర్మెన్లు దేవరశెట్టి శ్రీనివాసులు,ఎర్ర శంభులింగారెడ్డి, గంట అంజిరెడ్డి, చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, క్లబ్ ఉపాధ్య క్షులు చామల మహేందర్ రెడ్డి, కార్యదర్శి మారోజు వెంకటాచారి, కోశాధికారి వడ్లకొండ భిక్షం, సభ్యు లు దునక వెంకన్న, గుండ్ల రామ్మూ ర్తి, వావిలాల రామలింగయ్య శర్మ,మురారిశెట్టి కరుణాకర్, దామెర్ల శ్రీనివాస్, దాచావరం జగదీష్ బాబు,జోగు శ్రీనివాస్, మండల వైద్యాధికారి సూర్య శిల్ప, పిహెచ్ఎన్ రాములమ్మ, సూపర్ వైజర్ మరియా, కంటివైద్య నిపుణులు పవన్ హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.