Humility for faith..! విశ్వాసానికి వినమ్రత..!
బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటిoచిన సీఎం -- దాదాపు పాత కాపులoదరికి అవకాశం --119 గాను 115 అసెంబ్లీ స్థానాలకు ఎంపిక -- 7స్థానాల్లో మార్పు, 4స్థానాల్లో పెండింగ్ -- రెండు స్థానాల్లో గులాబీ దళపతి పోటి
విశ్వాసానికి వినమ్రత..!
—బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటిoచిన సీఎం
— దాదాపు పాత కాపులoదరికి అవకాశం
–119 గాను 115 అసెంబ్లీ స్థానాలకు ఎంపిక
— 7స్థానాల్లో మార్పు, 4స్థానాల్లో పెండింగ్
— రెండు స్థానాల్లో గులాబీ దళపతి పోటి
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు అధికార బి అర్ ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయ్యింది. తీవ్ర ఉత్కంఠ నడుమ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అపోహలు అనుమానాలతో పాటు తీవ్ర చర్చలకు దారి తీసిన అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పెట్టకేలకు పూర్తయింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావాహులు అందరూ ఎంతగానో ఎదురు చూసిన తొలి జాబితా రానే వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాలకు గాను మొత్తం 115 మంది సభ్యులతో కూడిన జాబితాలో దాదాపు పెట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు దక్కినా 7 లో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆయా సిట్టింగ్ లకు ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తులకు కేసీఆర్ అవకాశం కల్పించారు. అభ్యర్థుల ఎంపికలో నిఘా విభాగం నివేదికల ఆధారంగా సుదీర్ఘంగా కసరత్తు చేసిన కేసీఆర్ తొలి జాబితాను రూపొందించారు.
ఏడు సెగ్మెంట్లలో మార్పు నాలుగు స్థానాలు పెండింగ్ రెండు చోట్ల కేసీఆర్ పోటీ గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దాదాపుగా సిట్టింగ్ లoదరికీ అవకాశం ఇచ్చారు.
రెండు స్థానాల్లో గులాబీ దళపతి…సీఎం కేసీఆర్ ఈ సారి రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో లోకసభకు రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసిఆర్ ఇప్పుడు అసెంబ్లీ స్థానాలకు చేయనున్నారు.
ఉమ్మడి జిలాలో సంబరాలు… ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 12 మందికి సిట్టింగ్లకే అవకాశం కల్పించడం తో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.