Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kavitha: తెలంగాణకు బయలుదేరిన కవిత

–సెప్టెంబర్‌ 11 తేదీకి విచార‌ణ‌ వా యిదా
–ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు బ‌య‌ లుదేరిన క‌విత

Kavitha: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో (In Delhi Liquor Scam Case) దర్యాప్తు సంస్థ సీబీ ఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ట్రయల్ కోర్టు వేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్‌ 11 తేదీకి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. ట్రయల్ కోర్టు నేడు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్‌ సిసోడి యా, ఇతర నిందితులు వర్చువల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు (Filed by CBI)చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలి టీతో ఉ‍న్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టు ను కోరారు.

సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను (documents)వారికి అందజే యాలని జడ్జి కావేరి భావేజా అదేశించారు.ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి బెయి ల్‌పై విడుదలైన కవిత బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఆమె విమా నంలో బయలుదేరారు. ఆమెతో పాటు సోద‌రుడు కెటిఆర్, ప‌లు వురు బిఆర్ఎస్ నేత‌లు కూడా ప‌య‌మ‌య్యారు. వారంతా సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు (Shamshabad Airport)చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె తన నివాసానికి వెళ్లనున్నారు.కాగా, తమ అభిమాన నాయకురాలు దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండడంతో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేసింది. అలాగే భారీగా బిఆర్ఎస్ నేత‌లు,కార్య‌క‌ర్త‌లు ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport)త‌ర‌లివ‌చ్చారు