Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Selfie photo: సెల్ఫీ మోజులో ఆదమరిచి…

Selfie photo: ప్రజా దీవెన, నల్లగొండ: సెల్ఫీ ఫోటో మోజులో ఓ మహిళ ఆదమరిచి ఆపదలోపడ్డ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసు కుంది. సెల్ఫీ ఫోటో (Selfie photo) తీసుకుందా మన్న అత్యుత్సాహంలో ఓ మహిళ ప్రాణాల Woman lives) మీదకు తెచ్చుకుంది. నల్ల గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద సాగర్ ఎడమ కాల్వ నుంచి సెల్ఫీ దిగుతుండగా సదరు మహిళ కాలు జారి కాల్వలో పడి పోయిoది. వరద ఉదృతి కి కాల్వ లో కొట్టుకుపోతున్న మహిళను చూసిన స్థానికులు అప్రమత్తమై ఈతగాళ్లను కాలువలోకి దింపి ఆ మహిళను రక్షించారు.స్థానికుల అప్ర మత్తతతో మహిళ (woman) సురక్షితంగా ఒడ్డుకు చేరింది.