–ఐఐటి ధన్బాద్ ప్రొఫెసర్ పెంట్యాల శ్రీనివాస్ రావు
Pentyala Srinivas Rao: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ లో గణితం పాత్ర, Role of Mathematics in Artificial Intelligence, Mission Learning)ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అం శంపై సదస్సు నిర్వహించారు. మ హాత్మా గాంధీ విశ్వవిద్యాలయం గణిత విభాగాధిపతి డాక్టర్ మద్ది లేటి పసుపుల అధ్యక్షతన (Under the chairmanship of Maddi Leti Turukal)శుక్రవా రం జరిగిన సదస్సులో ప్రసంగించ డానికి వచ్చిన ప్రొఫెసర్ పెంట్యాల శ్రీనివాస్ రావు (Pentyala Srinivas Rao)మాట్లాడుతూ విద్యారంగంలో, వైద్యరంగంలో, విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంలో, డాటా సైన్స్ లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్, మిషన్ లెర్నింగ్ పాత్రను వివరిస్తూ మూలం గణితం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఐటి మరియు ఎన్ఐటి లో పీజీ మరి యు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండే పరిశోధన మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ అవకాశాలను వివరిం చారు.
ఈ కార్యక్రమంలో యూని వర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొర్రిపల్లి ప్రేమ్ సాగర్, బి ఓ ఎస్ చైర్మన్ డాక్టరు ఉపేందర్ రెడ్డి, మరియు అధ్యాపకులు డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, డాక్టర్.ఎం రామచంద్రుడు, డా. భిక్షమయ్య మరియు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ మెటిక్స్ విద్యార్థులు పాల్గొన్నారు.