Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rain Alert: రాష్ట్రంలో భారీ వర్షాలు

— రాజధాని హైదరాబాదు కు ఆరెంజ్ అలర్ట్

Rain Alert: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు (heavy rains) కురు స్తున్నా యి. కొన్ని చోట్ల ముసురు అలు ముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుం డపోతగా వర్షం కురిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. కాగా శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతా వరణ శాఖ అంచనా వేసింది. రాత్రి కురిసిన వర్షం శనివారం ఉదయానికీ వదలకపోవడంతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసు లకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిం చింది.

ఇదిలా ఉండగా హైద రాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో శని,ఆదివారాలకుగానూ ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert)జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ, మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉమ్మ డి ఆదిలాబాద్, కరీంనగర్, వరం గల్, ఆదివారం ఉమ్మడి ఖమ్మంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు (heavy rains)కురుస్తాయని ప్రకటించింది. సెప్టెంబరు 2, 3 తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో నగరంతో పాటు పలు మండలాల్లో వర్షం దంచి కొట్టింది. బోనకల్లులో అత్యధికంగా 6.92 సెంమీ, మధిరలో 3.44 మీ పాతం నమోదైంది.జగిత్యాల జిల్లా మేడిపల్లి 8.6, జగిత్యాలలో 8.46 సెంటీమీటర్ల వర్షపాతం నమో దైంది. శనివారం జయశoకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూ బాబాద్, వరంగల్, హన్మకొండలో (Jayashokar in Bhupalapally, Mulugu, Bhadradri Kothagudem, Khammam, Mahbubabad, Warangal, Hanmakonda)భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. నిజామాబాద్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, జనగామ, యాదాద్రి, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షా లు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

లోతట్టు ప్రాంతాలు జలమ యం.. వర్షాల ప్రభావంతో హైద రాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్‌ప ల్లి, లింగంపల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, నాంపల్లి, కొండా పూర్, మాదాపూర్, చందానగర్, దిల్ సుఖ్ నగర్, ఫిల్మ్‌నగర్, హయ త్ నగర్, లక్డీకపూల్, కోఠి, ఖైర తాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, వన స్థలిపురం సహా చాలా ప్రాంతాల్లో వర్షం (rains)దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది.లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖ రు వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అక్టోబర్‌లోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Department of Meteorology)అధికారులు చెబుతున్నారు. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.