Aloe Vera Juice: అలోవెరా (Aloe Vera) లేదా కలబంద గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం. అలోవెరాలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కూడా సమకూర్స్థాయి. అలోవెరా జ్యూస్ లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3, బీ6, బీ12 (Vitamin A, C, E, B1, B2, B3, B6, B12) లాంటి విటమిన్లు ఎక్కువగా ఉండడంతో కాళీ కడుపున ఈ జ్యూస్ తాగితే మాత్రం చాలా సులువుగా బరువు తగ్గించుకోవచ్చు.
అలాగే ఉదయాన్నే ఈ అలోవెరా జ్యూస్ ను తాగడంతో జీర్ణక్రియకు (digestion)సహాయపడడంతో పాటు గ్యాస్ మలబద్ధకం లాంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇక అలోవెరా లో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుకోవడంతో పాటు జలుబు, జ్వరాలు ఇలాంటి సమస్యలను కూడా సులువుగా తగ్గిస్తుంది. ఇక అలాగే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కొన్ని అనర్ధాలు కూడా ఉన్నాయని డాక్టర్ నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే మధుమేహంతో (diabetes) బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపున అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి ఆంటీ డయాబెటిక్ (diabetes)లక్షణాలు కలుగజేస్తాయని తెలియజేస్తున్నారు. దీంతో రక్తంలో ఉండే చక్కర శాతాన్ని తగ్గించడమే కాకుండా మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుందని డాక్టర్లు తెలియజేస్తున్నాను. అలాగే ఆడవారు ఈ అలోవెరా జ్యూస్ తాగడం వల్ల చర్మాన్ని మృదువుగా మెరుస్తూ చేసుకోవడంతోపాటు జుట్టు కురులను కూడా బలంగా చేసుకోవచ్చు. అయితే గర్భవతులు కానీ పాలు ఇచ్చే తల్లులు కానీ అలోవెరా జ్యూస్ తాగే (aloe vera jucie) ముందు ఒక్క సారి వైద్యుని సంప్రదించడం మంచిది అని కొందరి అభిప్రాయం.