Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Even in Singapore..! సింగపూర్ సిగలోనూ..!

-- అక్కడి అధ్యక్ష ఎన్నికల్లో మనోడు పోటీ -- అర్హత సాధించిన భారత సంతతి షణ్ముగరత్నం

సింగపూర్ సిగలోనూ..!

— అక్కడి అధ్యక్ష ఎన్నికల్లో మనోడు పోటీ
— అర్హత సాధించిన భారత సంతతి షణ్ముగరత్నం

ప్రజా దీవెన/సింగపూర్: అంతర్జాతీయ స్ధాయిలో మనోళ్లు మస్తు మస్తుగా ఖ్యాతి గడిస్తున్న విషయం విదితమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయితే ఒకే కాని అత్యున్నతమైన రాజకీయ రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు.

ఆయితే విదేశాల్లో అషామాషి స్థాయి పదవులు కాదు ఏకంగా దేశాధినేతల పదవులకు పోటీ పడి పలు విజయాలు సాధించిన విజయం తెలిసిoదే. తాజాగా సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన థర్మన్‌ షణ్ముగరత్నం పోటీ పడుతున్నారు.

సెప్టెంబర్‌ 1న జరగనున్న ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.66 ఏళ్ల వయసున్న షణ్ముగరత్నం చైనా సంతతికి చెందిన కాక్‌ సాంగ్, తన్‌ కిన్‌ లియాన్‌తో పోటీ పడతారు.

మొత్తం ఆరుగురు నుంచి దరఖాస్తులు అందగా వీరు ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అర్హత సాధించారని ఎన్నికల కమిటీ ప్రకటించింది. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారు. సెప్టెంబర్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి.