Holidays: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు (rains) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి వాగు లు వంకలు పొంగిపొర్లుతు న్నా యి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు (rains) పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు (Govt holiday)ప్రకటించింది.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోందని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు.