–భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌లు ధ్వంసం
–ఎక్కడికక్కడే నిలిచిపోయిన పలు రైళ్లు
— బోసిపోయిన వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లు
Railway Alert: ప్రజా దీవెన, విజయవాడ: విజయవాడ – వరంగల్ రైల్వే మార్గంలోని ఇంటికన్నె – కేస ముద్రం రైల్వేస్టేషన్ల మధ్య ఎగువ, దిగువ రైల్వేట్రాక్‌లు (Railway tracks) ధ్వంసం, మహబూబా బాద్ – తాళ్లపూస పల్లి రైల్వే ట్రాక్‌పై వరద నీరు కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. విజయవాడ– వరంగల్–సికింద్రాబాద్, విజయవాడ–వరంగల్ – న్యూఢిల్లీ మార్గాల్లో రైళ్ల రాకపోకలు శనివారం రాత్రి నుంచి పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మార్గంలో నడుస్తున్న రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపిశారు. శనివారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షం ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది.
భారీ వర్షంతో (heavy rains)రైల్వేస్టేషన్, రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోగా సిబ్బంది తొలగిం చారు.కాగా, సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం బయలుదేరిన మచిలీపట్నం – బీదర్ ఎక్స్‌ప్రెస్ శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అర్ధరాత్రి నుంచి వరంగల్‌లో నిలిచిపోయిన ఈ రైలును ఆదివారం ఉదయం 7.30 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు పంపించారు. అలాగే శనివారం అర్ధరాత్రి నుంచి ఎలుగూరు రైల్వేస్టేషన్లో నిలిచిపోయిన పాటలీపుత్ర – యశ్వంత్‌పూర్ రైలును ఆదివారం ఉదయం 9.30 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు పంపించారు. శనివారం రాత్రి నుంచి చింతల్‌పల్లి రైల్వేస్టేషన్లో నిలిచిపోయిన సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ను ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌కు పంపించారు. చింతల్‌పల్లి, ఎలుగూరు, వరంగల్ రైల్వేస్టేషన్లలో నిలిచిపోయిన పాటలీపుత్ర – యశ్వంత్‌పూర్, సంబల్పూర్, మచిలీపట్నం – బీదర్ ఎక్స్‌ప్రెస్‌ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగ కుండా వరంగల్ రైల్వేస్టేషన్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రైల్వే రక్షిత బృం దం(ఆర్పీఎఫ్) ప్రయాణికులకు భద్రత ఏర్పాట్లు చేసింది. వరంగల్ రైల్వే చీఫ్ కమర్షియల్ (Railway Chief Commercial) ఇన్స్పెక్టర్ బి.రాజ్‌గోపాల్, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఆర్.రాజేంద్ర ఆధ్వర్యం లో కమర్షియల్ సిబ్బంది ప్రయాణికులకు తగిన సహకారం అందించారు.
వరదలతో పలు రైళ్ల రద్దు
వరంగల్ మీదుగా సికింద్రాబాద్, – విజయవాడ మధ్య ప్రయాణిం చాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. గోల్కొండ, కృష్ణ, ఇంటర్సిటీ, శాత వాహన, గోదావరి, చార్మినార్ రైళ్ల ను రద్దు చేశారు. ఆదివారం వరం గల్ (warangal)మీదుగా వెళ్లాల్సిన పద్మావతి, సింహ పురి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వరంగల్‌కు రాకుండా సికింద్రాబాద్ నుంచి కాచిగూడ మీదు గా దారి మళ్లించారు. అలాగే న్యూఢిల్లీ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సిన రైళ్లను వరంగల్ రాకుండా కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు (Secunderabad)తరలించా రు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు కారణంగా వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో శనివా రం రాత్రి నుంచి హెల్ప్లైన్లు పనిచేస్తున్నాయి. రైళ్ల రద్దు, దారి మళ్లింపు సమాచా రాన్ని హెల్ప్‌డెస్క్ సిబ్బంది ప్రయాణికులకు చెబుతున్నారు. రైళ్ల రద్దుతో వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లు ఆదివారం వెలవెలబోయాయి. ఇదిలా ఉండగా, ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ భరతేష్‌కుమార్ జైన్ సికిం ద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వచ్చారు. వరద నీరు కారణంగా ధ్వంసమైన ఇంటి కన్నె – నెక్కొండ రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను పర్యవేక్షించారు.