Chandrayaan on the moon..! చంద్రుని పై చంద్రయాన్..!
చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3 ప్రయోగం --ఇంతింతై వటుడింతై జగమంతైన ఇస్రో -- చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా భారత్
చంద్రుని పై చంద్రయాన్..!
-prajs
–చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3 ప్రయోగం
–ఇంతింతై వటుడింతై జగమంతైన ఇస్రో
— చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా భారత్
ప్రజా దీవెన/ ఇస్రో: చంద్రుని చెంతకు మన చంద్రయాన్-3 చూడచక్కగా చేరుకుంది. దీంతో ప్రపంచంలోనే ఏ దేశం సాధించండి చరిత్ర మన భారతదేశం దక్కించుకుంది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా చంద్రయాన్ 3 సక్సెస్ చేయడం ద్వారా జగమంతైoది ఇస్రో. చంద్రుని దక్షిణ ధ్రువం పై అడుగుడిన ప్రగతి దేశంగా భారత్ రికార్డు (Indian record) సృష్టించింది.
చంద్రుడి చరిత్ర గుట్టు విప్పేందుకే ( Unraveling the history of the moon) జాబిల్లిని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా అంతుచిక్కని అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్-3 ప్రయోగం ప్రధాన లక్ష్యంగా ఇస్రో పేర్కొంది.చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ తో మనకు కలిగే మేలు ఏమిటంటే…
చంద్రయాన్ లో సహజంగానైతే ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు ఉంటుంది. చంద్రయాన్-2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్-3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు.
చంద్రయాన్-3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను (State-of-the-art technology equipment) అమర్చాడం జరిగింది. దక్షిణ ధ్రువంపై దిగాలని ప్రధాన లక్ష్యంగా ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి కాని భారత్ మాత్రం చంద్రయాన్-1 నుంచి తాజా చంద్రయాన్-3 దాకా చంద్రుని వెనుక వైపoటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందు( To explore the South Pole)కే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఆ క్రమంలోనే చంద్రయాన్-3 ల్యాండర్( Chandrayaan-3 Lander) ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించేందుకు ప్రయత్నాలూ సాగాయి. ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్-3లో అమర్చారు.2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కేజీల అపోజి ఇంధనం( Apogee Fuel) నింపి దాని సాయంతోనే ల్యాండర్, రోవర్లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లారు.
చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఓ పరికరాన్ని కూడా అమర్చడం జరిగింది.చంద్రుని ఉపరితలం( Moon’s surface) వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది.
రోవర్లో మూడు పేలోడ్లను పంపుతూ ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ (Longmuin Prob) చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది.చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది.
ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ (Radio Anatomy of the Moon Bound) హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి. అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు.
లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిoచడం ప్రధాన లక్ష్యం(The main objective is to search) గా పేర్కొంటున్నారు. చంద్రయాన్-2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం( Most valuable information) అందిస్తోంది.
చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్-2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్-3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు( For research on the Sun) ఆగస్టులో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి.