కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి
— 22 మంది కార్మికులను బలి
ప్రజా దీవెన/మిజోరం: మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. బుధవారం సైరాంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
రోజువారీలాగే కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నo కాగా ఉన్నఫలంగా బ్రిడ్జి కూలడంతో 22 మంది ప్రాణాలుకోల్పోయారు. బ్రిడ్జి కూలిన సమయంలో దాదాపు 40 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకొన్న మిగతా వారి కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు.