Teja Talent School: ప్రజా దీవెన, కోదాడ: స్థానిక తేజ టాలెంట్ పాఠశాల (Teja Talent School) విద్యార్థుల ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయం కొరకు “చేయి చేయి కలుపుదాం – వరద బాధితులను ఆదుకుందాం” అనే నినాదంతో, ప్రజలను చైతన్య పరిచేందుకై బుధవారం పట్టణ వీధులలో మహా ర్యాలీని (Great rally)నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ రామ్మూర్తి (Rammurthy in charge) మాట్లాడుతూ ప్రకృతి కన్నెర్ర చేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతులం అయ్యారని, గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఆకాశానికి రంద్రం పడ్డట్లుగా కురిసిన భయంకరమైన వర్షం ఎన్నో కుటుంబాలను, మూగజీవులను, రైతులను అనేక విధాలుగా దిక్కులేని వారిని చేశాయని తెలిపారు.
ప్రభుత్వ సహాయంతో పాటు ప్రజలు కూడా తమకు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన తోటి మానవులకు ఇతీదికంగా సహాయం చేసినట్లయితే ఎన్నో కుటుంబాలకు ఊరట కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అప్పారావు గారు, సెక్రటరీ సంతోష్ కుమార్ గారు, వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్ గారు, ఉపాధ్యాయులు ఎస్.ఎన్.ఆర్, వీరభద్రం, రమేష్, వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.