forests of Tadwai: ప్రజా దీవెన, తాడ్వాయి : తాడ్వా లో (Tadwai) గత నెల31 శనివారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు, జడివానతో సుమారు 500 ఎకరాలలో 50 వేలకు పైగా వివిధ రకాల వృక్షాలు నేల కూలిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం అటవీ శాఖ కు చెందిన పిసిసిఎఫ్ఓ.ఆర్ఎం డోబ్రియల్ (PCCFO.RM DOBRIEL)తో పాటు ఉమ్మడి వరం గల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాల అట వీ శాఖ అధికారులు మండలం లోని తాడ్వాయి మేడారం మార్గ మధ్యలో చెట్లు విధ్వంసం అయిన అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్బంగా డోబ్రియల్ (Dobriel)విలేక రులతో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల క్లౌడ్ బర స్ట్ తో గెయిల్స్ స్టాంమ్ లాగా ఏర్ప డి మైక్రో క్లౌడ్స్ కిందకు రావడంతో ఈ విధ్వంసం జరిగిందని అను కుం టున్నామని తెలిపారు. ఈ ప్రాం తంలో మంచి నేల ఉన్నదని కొన్ని చెట్లకు ఒక్క ఫీట్ వరకు భూమిలో కి వేర్లు వెళ్లాయన్నారు. అయితే గాలి నలు దిశల నుండి రావడంతో చెట్లు కూలిపోయాయని కొమ్మలు విరిగి పోయాయని పలు రకాల చెట్లు వేర్లతో సైతం పడిపోయాయి అన్నారు. ఇది అంతా లోకల్ క్లైమే ట్ కండిషన్ తో జరిగిందని వివ రించారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్త రాఖండ్ లలో దీన్ని క్లౌడ్ బరస్ట్ (Cloud burst) అంటామని ఈ ప్రాంతంలో అదే మిక్స్ అయిందని వివరించారు. ఒకేసారి ఉరుములు మెరుపులు మేఘాలు,వర్షం గాలితో రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వృ క్షాల వేర్లు బలంగా లేవని చాలా దూరం భూమిలోకి వేర్లు వెళ్ళని కారణాలతో చెట్లు సునాయాసంగా పడిపోయినట్లు గ్రహించామని అ న్నారు. పైననే మినరల్స్ దొరకడం వలన వేర్లు లోతుకు భూమిలోకి వెళ్లలేదన్నారు.
నా 37 సంవత్స రాల సర్వీసులో ఇంతవరకు ఈ పరిస్థితి చూడలేదని తెలిపారు. దీనిపై మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (Metrological Department) ఎన్ఆర్ఏస్ ఎ సంస్థ లతో సర్వే చేయించడానికి సిద్ధంగా ఉన్నా మన్నారు. దీనిపై స్పెషల్ రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సమర్పిస్తామని తెలిపా రు. ప్రస్తుతం వర్షాలు ఉన్నందున పూర్తి సర్వే డ్రోన్ల ద్వారానే పరిశీ లించి 500 ఎకరాలలో 50 వేల చెట్లు కూలిపోయినట్లు తెలుసుకుం న్నామని, మరో 10 రోజులలో పూ ర్తి సమాచారం తెలుసుకుంటామని వివరించారు. ఈ ప్రదేశంలో సహ జంగానే చెట్లు పెరుగుతాయని నేల బాగుందని ఐదేళ్లలో భారీగా అడవి పెరుగుతుందని, మళ్లీ యధావిధి గా ఈ ప్రాంతంలో అడవి దట్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాలేశ్వ రం భద్రాద్రి, కొత్తగూడెం సిసిఎఫ్ఓ లు ఏ ప్రభాకర్,భీమ నాయక్ తో పాటు డిఎఫ్ఓ రాహుల్ కిషన్, స్థా నిక ఎఫ్ డి ఓ వజ్రారెడ్డి, ఎఫ్ ఆర్ ఓ లు సత్తయ్య, కృష్ణవేణి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.