Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RAIN ALERT: వదలనoటున్న వర్షo..!

–నేడు మరో అల్పపీడనంకు అవ కాశం, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌

RAIN ALERT: వర్షాలు ఒకింత తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఊరట చెందే లోపే మంగళవారం అర్ధరాత్రి నుం చి కొన్నిజిల్లాల్లో బుధవారం ఉద యం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షా లు (heavy rains) దంచికొట్టాయి. రాష్ట్రం లోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహె డలో 24 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తెల్లవారు జాము నుం చి కురిసిన భారీ వర్షా నికి కోహెడ మండలం జలదిగ్బంధమైంది. అనే క గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉద యం 6 గంటలకు ప్రారంభమైన వర్షం 9 గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్‌లో (Medchal, Malkajigiri District, in Ghatkesar)మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం తీవ్ర రూపందాల్చి ఉరుము లు, మెరుపులతో రెండు గంటల పాటు కుంభవృష్టిగా కురిసింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు ఘట్‌కేసర్‌ మండలంలోని వెంకటాపూర్‌ అరుంధతి, వైభవ్‌ కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. అలా గే గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైస మ్మగూడ మరోసారి జల మయ మైంది.

కొన్ని హాస్టళ్ల సెల్లా ర్లలో నీరు చేరడంతో విద్యార్ధులు బయ టికి రాలేని పరిస్థితి ఏర్ప డింది. సంగారెడ్డి(sangareddy) జిల్లా కేంద్రానికి చేరువ లో ఉన్న 161 నంబరు నాందేడ్‌, అకోలా జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. దాదాపు 4 గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో హైవే అథారిటీ సిబ్బంది డీజిల్‌ మోటార్లను (Diesel motors తెప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిని ట్యాంకర్లతో తోడే సినా వరదనీటి ప్రవాహం తగ్గలేదు. ఇక జోగు లాంబ గద్వాల జిల్లాలో నెట్టెం పాడు ప్రాజెక్టు కింద నిర్మించి న చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పరి ధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో చేరి న వరదనీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రిజర్వాయర్‌ బ్యా క్‌ వాటర్‌ అంతా గ్రామాన్ని చుట్టు ముట్టి ఇళ్లలోకి చేరడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. గ్రామంలోకి వస్తున్న తేళ్లు, పా ముల మధ్య ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బతుకు తున్నా రు. బుధవారం గ్రామానికి చెందిన రైతు వడ్డె మల్లేష్‌ (18) నారుమ డిలో నారు తీయడానికి వెళ్లి విష పురుగు కాటుకు బల య్యాడు.

ఇక హైదరాబాద్‌ (hyd)నగరం లోనూ మంగళవారం రాత్రి 11గం టల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకూ పలు ప్రాంతాల్లో 8.7 నుంచి 5 సెం.మీ వర్షం కురి సింది.నగరంలో మరో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధి కారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తం గా కూడా రానున్న నాలుగు రోజు ల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నా యని హైదరాబాద్‌ వాతావరణ శాఖ (Department of Meteorology)ఎల్లో అలర్ట్‌ (yellow aleert)జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచి ర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగి త్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మూడు రోజు లుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో వర్షపు నీరు చేరడం వల్ల ఓవర్‌ బర్డెనింగ్‌ సహా ఇతర పను లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భూపాలపల్లి ఏరియాలో రోజుకు 47,146 వేల మెట్రిక్‌ ట న్నుల బొగ్గు వెలికితీతకు అంత రాయం ఏర్పడిందని సింగరేణి వర్గాలు తెలిపాయి. అలాగే వర్షాల కారణంగా మంచిర్యాలజిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోగా, ఓబీ తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతోంది.