–రాష్ట్ర సరిహద్దు వద్ద నిత్యం నిఘా ఏర్పాటు చేయాలి
— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Sarat Chandra Pawar: ప్రజా దీవెన, అడవిదేవులపల్లి: అడవిదేవుల పల్లి పోలీస్ స్టేషన్ (police station) ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని స్థితిగతులు గురించి యస్.ఐ అడిగి తెలుసు కుని,రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ (Reception, Station Writer, Lock Up, Y.H.O Room)తదితర ప్రదేశాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ప్రజలకు పోలీసు స్టేషన్లో ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.
దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రొలింగ్ (Patrolling) నిర్వహించాలని, సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన పెంచాలని, రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దు వెంట అక్రమ గంజాయి రవాణా (Trafficking in illegal marijuana), పిడీయస్ బియ్యం (Transport, PDS rice) అక్రమ రవాణా మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పగలు,రాత్రి 24/7 పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల గూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు,మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు,అడవిదేవుల పల్లి యస్.ఐ శేఖర్ మరియు సిబ్బంది ఉన్నారు.