Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mother Teresa: కుష్టు రోగులకు అనాధలకు మదర్ థెరిసా చేసిన సేవలు మరువలేనిది.

మదర్ థెరిసా 27వ వర్ధంతి

Mother Teresa: ప్రజా దీవెన, కోదాడ: భారతదేశంలో కుష్టురోగులకు దిక్కులేని అనాధలకు భారతరత్న మదర్ థెరిసా (Mother Teresa) చేసిన సేవలు మరువలేనియని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల(Municipal Chair Person Samineni Pramila), కోదాడ నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ డాక్టర్ యేసయ్య, డాక్టర్ బిషప్ దుర్గం ప్రభాకర్ లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాస్టర్ యెసయ్య (Pastor Isaiah)ఆధ్వర్యంలో మదర్ థెరిసా వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గురువారం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మథర్ తెరిస్సా సేవలు చిరస్మరణీయం అనీ సమాజంలో ఆమె చేసిన సేవా ప్రపంచంనీకే ఆదర్శం అనీ అన్నారు.భారతరత్న మదర్ థెరీసా సెప్టెంబర్ 5, 1997 లో కలకత్తా లో మరణించిందని.

ఈమె అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసి. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of Charity) భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు,(కుష్ఠు) రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.ద్వారా 1970 ల నాటికి మానవతా వాదిగా, పేద ప్రజలు, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి (Nobel shanthi) పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిందనీ.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించిందనీ.ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసలు పొందిందని, వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, కో ఆర్డినేటర్ మాడుగుల సుందర్ రావు, నియోజకవర్గం సెక్రెటరీ పాస్టర్ రాజేష్, కోర్ కమిటీ చైర్మన్ రెవ. డా. సి. హెచ్ లూకా, టౌన్ ప్రసిడెంట్ ప్రభుదాస్, నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజారావు, పాండు , రెవ. మీసా దేవసహాయం, రెవ. తలకప్పల దయాకర్ , . రవికాంత్