Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

In the air on… today in the water నాడు గాలిలో… నేడు నీటిలో

-- రూపం మార్చి మనుగడలోనే

నాడు గాలిలో… నేడు నీటిలో

— రూపం మార్చి మనుగడలోనే

ప్రజా దీవెన/డబ్లూహెచ్ వో: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మనుగడలోనే ఉందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదన్న వాస్తవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన నివేదిక ద్వారా వెల్లడించింది.

ఆయితే నాడు గాలిలో విస్తృతమై మానవ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసిన కరోనా నేడు నీటిలో తన రూపం మార్చుకుని వ్యాపిస్తోందని తెలిపింది. గతంలో గాలి ద్వారా వ్యాపించిన కరోనా వైరస్ రకాలు ప్రస్తుతం ఉత్పరివర్తనాల కారణంగా నీటి ద్వారానూ వ్యాపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

గత నెలలో 9 రకాల కరోనా వేరియంట్లను గుర్తించగా, ఈ నెలలో కరోనా బీఏ 2.86ను గుర్తించారు. ఇది నీటిలో కనిపించడంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసి ఇప్పటివరకు దీని కారణంగా మరణాలు సంభవించినట్టు ఎక్కడా వెల్లడి కాలేదని, కానీ దీనిపై పూర్తి స్థాయి పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

ఈ బీఏ 2.86 వేరియంట్ స్విట్జర్లాండ్, థాయ్ లాండ్ లో గుర్తించినట్టు వివరించింది. కాగా, భారత్ లోనూ మళ్లీ కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించడంతో కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహించింది.