*గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.అంజియాదవ్
Ganesh Navratri celebrations: ప్రజా దీవెన, కోదాడ: గణేష్ నవరాత్రి ఉత్సవాలను (Ganesh Navratri celebrations) కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు (BC Sangam State Presidents, BJP State Leaders) డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.శనివారం అంజి యాదవ్ (Anji Yadav) నివాసంలో నియోజకవర్గ యువజన సంఘాల సమావేశము నిర్వహించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు భక్తి మార్గంలో నడవడం వలన యువత తప్పుదారి పట్టకుండా వారు సక్రమమైన మార్గంలో నడవడానికి ఈ భక్తి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేడు నియోజకవర్గంలో యువత గణేష్ విగ్రహాలను (Ganesh idols) కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అందువలన యువత ఇబ్బంది పడకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 150 విగ్రహాలను సొంత ఖర్చులతో పంపిణీ చేస్తున్నామని తెలిపారు..ఈ వినాయక విగ్రహాల పంపిణీ (Distribution of Ganesha idols) కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ యువజన సంఘాల సభ్యులకు ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శేఖర్ నాయుడు, వెంకన్న,శ్రీకాంత్,వెంకటేష్ బాబు ,వంగవీటిశ్రీను,నాగచారి,పవన్,ఠాకూర్ నాయక్,జనార్దన్ రావు,నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ ఉత్సవ కమిటీ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.