PM Modi in Bangalore బెంగుళూరులో ప్రధాని మోదీ
-- ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిచేoదుకే -- విదేశీ పర్యటన నుంచి మేరుగా బెంగళూరుకే
బెంగుళూరులో ప్రధాని మోదీ
— ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిచేoదుకే
— విదేశీ పర్యటన నుంచి మేరుగా బెంగళూరుకే
ప్రజా దీవెన/ బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగుళూరు నగరానికి చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారంటే ఇస్రో శాస్త్రవేత్తలు అంటే ఆయనకి ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ బెంగళూరుకు నేరుగా వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘జై విజ్ఞాన్..జై అనుసంధాన్’ నినాదం ఇచ్చారు. ”చంద్రుడిపై మన ల్యాండర్ దిగినప్పుడు భారత్‌లో నేను లేననీ, ఆ అద్భుత క్షణాలను విదేశాల నుంచి చూశానని అప్పుడే నేరుగా బెంగళూరుకు రావాలని వచ్చిన వెంటనే శాస్త్రవేత్తలను కలుసుకొనిఅభినందించాలను కున్నానని పేర్కొన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతగా ఉన్నా” అని మోదీ వెల్లడించారు. అనంతరం విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి మోదీ వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు.