Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IPHONE DISCOUNTS: భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు కారణం ఏమిటంటే

IPHONE DISCOUNTS: ప్రస్తుత యువతల ఐఫోన్ (iphone)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ ఉండడమే లక్జరీకి సింబల్ గా భావిస్తారు మరి కొందరు. సాధారణంగా ఆండ్రాయిడ్ (andhirid)ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ల ధర మూడు రేట్లు ఎక్కువగా ఉంటుంది.. అయితే క్వాలిటీ విషయంలో ఆపిల్ సంస్థ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఉంటుంది. అందుకొరకే ఆ కంపెనీకి చాలా డిమాండ్. అయితే ఈ క్రమంలో ఐఫోన్ 16 రిలీజ్ అవుతున్న క్రమంలో ఐఫోన్ 15 రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పాలి.. గతంలో ఆన్లైన్లో ఐఫోన్ 15 మాక్స్ ప్రో ధర ఉంటే ప్రస్తుతానికి మాత్రం 1,59,900 ఉంటే ఇప్పుడు దాని ధర 1,32,990 గా ఉంది. అలాగే 15 ప్రో కూడా 18 నుంచి 25 వేల వరకు డిస్కౌంట్ లో లభిస్తుంది .

అయితే ఐఫోన్ 15 (iphone 15), ఐఫోన్ 15 ప్లస్ ధరలలో పెద్దగా మార్పులు లేవు అలాగే కంపెనీ వాటిని విడుదల చేయడం కూడా దాదాపు బంద్ చేసుకుందనే చెప్పవచ్చు. అయితే ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర 1,60,00 0 రూపాయలు ఉండవచ్చని అంచనా. అయితే ఐ ఫోన్ 16 లో కూడా పెద్దగా మార్పులు లేకపోవడంతో ఐఫోన్ 15 మోడల్ కొనుక్కోవడం మంచిది అని కొందరు తెలియజేస్తున్నారు. అయితే వచ్చే వారం నుండి ఆపిల్ వాచ్ ల, అలాగే ఫోన్లపై బారిగా డిస్కౌంట్ (huge disocunts)లో ఉండబోతున్నాయని సమాచారం. ఈ క్రమంలో ఆపిల్ SE, ఆపిల్ 9 సిరీస్, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 పై భారీ డిస్కౌంట్ లో ఉండబోతున్నాయి. ఇంకెందు ఆలస్యం మీరు ఆపిల్ ప్రొడక్ట్స్ కొనాలి అంటే ఇదే మంచి అవకాశం అనే చెప్పాలి.