నెత్తుటి మరకకు పదహారేళ్లు…!
— గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు పేలుళ్లు ఓ చరిత్ర
ప్రజా దీవెన/ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గోకుల్ ఛాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన జంట పేలుళ్లు జరిగి పదహారేళ్లు గడిచాయి. ఘటనను భాగ్యనగర చరిత్రపై నెత్తుటి సంతకంలా భావించి సరిగ్గా 16 సంవత్సరాలు. నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌ల్లో నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే .
మొదటి పేలుడు లుంబినీ పార్క్ వద్ద రాత్రి గం.7.45 నిమిషాలకు జరగగా, రెండో పేలుడు గం.7.50 నిమిషాలకు గోకుల్ చాట్ వద్ద జరిగింది. దీంతో భాగ్యనగర ప్రజలు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.
ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా, 300 మంది కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఈ జంట పేలుళ్ళ ఘటనలు షాక్‌నకు గురి చేయగా బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి చాలామంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛాలుగా మిగిలారు.
బాంబు దాడులతో దద్దరిల్లేలా చేయగా పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా బాంబు బ్లాస్ట్‌లో అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. బాంబు పేలుళ్ళలో గాయపడ్డ మరికొందరు జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఆ సంఘటన జరిగి నేటికి 16 సంవత్సరాలు అవుతున్నా.. అది తలచుకుంటూ.. కుటుంబంలో కోల్పోయిన వారిని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.