Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Loan App: ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు

–రూ.2514 లోన్ తీసుకుంటే మూడు ల‌క్ష‌లు వ‌సూలు

Loan App: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో వారం రోజుల క్రితం జీడిమెట్ల కు చెందిన విద్యార్థి బాను ప్రకాష్ లోన్ యాప్ వేధిం పులు భరించలేక ఫాక్స్ సాగర్ లేక్ లో దూకి ఆత్మహత్య (sucide) చేసుకున్న ఘటన మరవకముందే మరో ఘ టన మేడ్చల్ జిల్లా పేట్‌ బషీరా బాద్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిం ది.వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ లం నందిగామ కు చెందిన M.వి నోద్ భార్య మంజుషాదేవి ఇద్దరు పిల్లలతో కలసి సుచిత్ర సమీపం లోని శ్రీరాం నగర్ లో నివాసముం టున్న బోయిన్ పల్లి లో ఓ ప్రయివే ట్ కంపెనీ (A private company) ఉద్యోగిగా పనిచేస్తున్నా డు. తండ్రి అనారోగ్యంతో లోన్ యాప్ లో తన భార్య పోటో పెట్టి రూ.2514 తీసుకున్నాడు. ఆ డబ్బుల కూడా కట్టేశాడు. అయితే లోన్ యాప్ నిర్వాహకులు వినోద్ ఇంకా డబ్బులు కట్టాలని వేధించ డం మొదలు పెట్టారు. లేదంటే ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించారు.

రోజూ ఫోన్‌ (phone)చేసి వేధించడంతో వినోద్ తన భార్యకు తెలియకుండా రెండు లక్షల పైగా చెల్లించాడు. అయినా లోన్‌ యాప్‌ వేధింపులు తగ్గలేదు. దీంతో విసుగు చెందిన వినోద్‌ ఇక నాదగ్గర లేవని ఇప్పటికే లోన్‌ చెల్లించడానికి అప్పుల పాల య్యా యని తెలిపాడు. చెల్లించక పోతే ఫోటోలను బంధువులకు, స్నేహితు లకు పంపుతామని లోన్ యాప్ నిర్వాహలకు బ్లాక్‌ మెయిల్‌ చేశా రు. వినోద్‌ డబ్బుల కోసం బయట ప్రయత్నించినా ఎక్కడా కుదర లేదని ఇదే విషయాన్ని లోన్‌ యాప్‌ వారికి తెలిపిన పట్టించుకోలేదు. చివరకు లోన్ ఆప్ నిర్వాహకులు అన్నంతపని చేశారు. వినోద్ ఫో టోలను మార్ఫింగ్ చేసి నగ్న వీడి యోలను , పోటోలను కుటుంబ సభ్యులకు పంపారు. దీంతో మన స్తాపం చెందిన వినోద్ ఆత్మహత్య (sucide) పాల్పడ్డాడు. ఆదివారం రోజున బార్యపిల్లలు కార్మిక నగర్ లో ఉన్న సోదరుని ఇంటికి పంపి నేను కూడ వస్తాను అంటూ చెప్పి పంపాడు. ఎవరు ఇంట్లో లేని సమయంలో వినోద్ ఆత్మహత్య పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన భార్య పోలీసులకు సమా చారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదే హాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.