–అక్టోబరు 29, 30 తేదీల్లో లాస్వె గాస్లో సదస్సు
–ప్రత్యేక అతిథిగా ఐటీ మంత్రి లోకేశ్ కు ఆహ్వానం
–వరద బాధితుల సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం
CM Chandrababu: ప్రజా దీవెన, అమరావతి: అమె రికాకు చెందిన ఐటీ కంపెనీల కన్సా ర్షియం ‘ఐటీసర్వ్ అలయెన్స్’ తమ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబును (CM Chandrababu) ఆహ్వానించింది. సద స్సుకు ప్రత్యేక అతిథిగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూ నికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆహ్వాన పత్రం అందించింది. ‘సిన ర్జీ’ పేరుతో నిర్వహించే ఈ సదస్సు అక్టోబరు 29, 30 తేదీల్లో లాస్వెగా స్లోని సీజర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఐటీసర్వ్ అలయెన్స్ గవర్నింగ్‌బాడీ ఛైర్మన్ అమరేశ్వరరావు వరద, సభ్యుడు వినోద్‌బాబు ఉప్పు, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు సురేష్ మానుకొండ సోమవారం చంద్రబాబు, లోకేశ్‌లను కలిసి ఆహ్వానం అందజేశారు.ఈ సద స్సుకు తాను హాజరవు తానని మంత్రి లోకేశ్ (Minister Lokesh) ప్రతినిధులకు హామీ నిచ్చారు. ఐటీసర్వ్ అలయెన్స్ వార్షిక సదస్సులో 2,500కు పైగా ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొం టారని, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలు, ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ వంటి కొత్త టెక్నా లజీలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని సంస్థ ప్రతినిధులు వారికి వివరిం చారు. విజయవాడ వరద బాధి తుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అంద జేశారు. ఐటీసర్వ్ అలయెన్స్ సుమారు 2,500 చిన్న, మధ్య తరహా ఐటీ స్టాఫింగ్, సర్వీసెస్ కంపెనీలతో ఏర్పాటైన కన్సార్షి యం. ఈ కన్సార్షియంలోని కంపె నీల మొత్తం వార్షిక ఆదాయం 1,000 కోట్ల అమెరికా డాలర్లు. ఈ సంస్థకు అమెరికాలోని 21 రాష్ట్రా ల్లో చాప్టర్లు ఉన్నాయి. అమెరికాతో పాటు, భారత్‌లోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. భారత్‌లో ఐటీసర్వ్ అలయెన్స్‌కు అనుబంధంగా ఉన్న కంపెనీలు హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నె, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఐటీసర్వ్ నేషనల్ ప్రెసిడెంట్ జగదీష్ మొసాలి, ప్రతినిధులు రఘు చిట్టిమళ్ల, సురేష్ పొట్లూరి ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.
ఇన్నోవేషన్, పురోగతికి మార్గదర్శి మీరు..
‘సినర్జీ-2024లో వివిధ రంగాలను ప్రభావితం చేసే గొప్ప నాయకులు, ఇన్నోవేటర్స్, అనేక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు (celebrities)పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా మీరు అందించిన అద్భుత నాయకత్వం.. అభివృద్ధికి, ఇన్నోవేషన్‌కు మిమ్మల్ని మార్గదర్శిగా నిలిపాయి’ అని చంద్రబాబుకు ఇచ్చిన ఆహ్వానపత్రంలో ఐటీసర్వ్ అలయెన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీకి పలు దఫాలు సీఎంగా ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక విధానాలు ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్, ఆర్థిక పురోభివృద్ధికి కేంద్రంగా మార్చాయని, ఆయనకు ‘దార్శనిక నేత’గా దేశవిదేశాల్లోనూ పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయని తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్‌ను టెక్నాలజీ పవర్‌హౌస్ (A technology powerhouse) మార్చడంలో చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుడు తమ సదస్సుకు ముఖ్యఅతిథిగా (as chief guest) హాజరవడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తామని చెప్పారు. గతంలో జరిగిన ఐటీసర్వ్ అలయెన్స్ (ITServe Alliance) వార్షిక సదస్సుల్లో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్లతోపాటు, హిల్లరీ క్లింటన్, సద్గురు జగ్గీవాసుదేవ్, నిక్కీ హేలీ వంటి ప్రముఖులు హాజరయ్యారని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ‘సినర్జీ’ సదస్సుకు ప్రత్యేక అతిథిగా పెప్సీకో మాజీ సి.ఇ.ఒ. ఇంద్రా నూయీ కూడా హాజరవుతున్నారు.