–24 గంటల్లో నిందితురాలిని అరె స్టు చేసిన నల్లగొండ వన్ వన్ టౌన్ పోలీసులు
–ఆరు లక్షల విలువ గల 9.4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
Inspector Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ పట్టణం శాంతి నగర్ కాలని బాలాజీ ఫంక్షనల్ హాల్ దగ్గర నివాసం ఉంటున్న మలాన్ బి ఈ నెల 8వ తేదిన కుటుంబ సమేతం గా ఆమె చెల్లి ఫంక్షన్ కి వెళ్లివచ్చి oది. తిరిగి ఇంటికి అదే రోజు రాత్రి 08.00 గంటలకు వచ్చే సరికి ఇంటి బీరు వాలో పెట్టిన 9.4 తులాల బం గారు ఆభరణాలు నల్లపూసల గొలుసు 03 తులాలు, బంగారు చైన్ 02 తుళాలు, ఒక జత బంగారు గాజులు 03 తులాలు, బంగారు చెవి బుట్టాలు 11.5 గ్రాములు మరియు ఒక బంగారు ఉంగరం 2.5 గ్రాములు దొంగిలిం చబడినవి.
నిన్నటి రోజు సాయం త్రం 06.00 గంటల ప్రాంతంలో నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి (Inspector Rajasekhar Reddy)కేసు నమోదు చేసి, ఎస్ఐ లు సందీప్ రెడ్డి, శంకర్ (SIs Sandeep Reddy, Shankar)లను రెండు బృందాలుగా క్రైమ్ పార్టీ సిబ్బంది తో యుక్తంగా సమీప సిసిటివి కెమరాలను పరిశీలించి, గుర్తించి ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న నిందితురాలైన కొత్తపల్లి ధనలక్మి ని ఈ రోజు ఉదయం ఆమె కిరాయికి ఉంటున్న ఇంటి వద్ద పట్టుబడి చేసి ఆమె వద్ద నుండి దొంగిలించిన సొ త్తుని స్వాదీనం చేసి రిమాండ్ చేయ డం జరిగింది.
ఇదిలా ఉండగా ఈ కేసు (case)విషయంలో త్వరితగతిన స్పందించి నిందితు రాలిని సీసీటీవీ కెమెరాల ద్వారా 24 గంటలలో పట్టుబడి చేసి దొంగి చించిన సొత్తుని రికవరీ చేసిన నల్గొం డ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డిని, ఎస్ఐలు సందీప్ రెడ్డి, శంకర్ క్రైమ్ సిబ్బంది షకీల్, శ్రీకాం త్ లను నల్లగొండ యస్. పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ అభినందిం చారు. ఈ సందర్బంగా మాట్లాడు తూ ప్రతి చోటా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే నేర నియంత్రణకు అరికట్టవచ్చు నని ప్రతి గ్రామాలలో, పట్టణాల లో, వ్యాపార సముదాయాలు, రహ దారి కూడలిలో సిసి కెమెరాల ను (CC cameras) ఏర్పాటు చేసుకోవాలని అన్నా రు. సీసీటీవీల ద్వారా దొంగత నాలు, రోడ్డు ప్రమాదాల మరియు ఇతర నేరాలు జరిగినప్పుడు సిసి కెమెరాల (CC cameras) ద్వారా నిందితులను గుర్తించవచ్చునని అన్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నేర నియత్రణ అదుపులోకి వస్తుందని అన్నారు.