–పర్యటన ముగించుకున్న కేంద్ర బృందం
–నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు
–బృంద సభ్యుల ఎదుట తమ బాధలు విన్నవించిన బాధితులు
Flood Situation Report: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో భారీ వర్షాలు (Heavy Rains), వరదల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బుధ, గురువారాల్లో మొత్తం నాలుగు జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం ముంపునకు గురైన ఇళ్లు, జరిగిన ఆస్తి నష్టాన్ని ప్రత్యక్షంగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్బంగా వరద బాధితులు కేంద్ర బృందానికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా తిలకించామని, నష్టంపై కేంద్రానికి నివేదిక అందిస్తామని కేంద్ర బృందానికి నాయకత్వం వహిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సలహాదారు కేపీ సింగ్ తెలిపారు. కేపీ సింగ్ నేతృత్వంలో మహేశ్‌కుమార్, శాంతి నాథ్ శివప్ప, ఎస్‌కే కుశ్వాహా, టి.నియాల్క్ హాన్సన్, శశివర్ధన్‌రెడ్డి తదితరులు గురువారం ఉదయం తొలుత ఖమ్మం( khammam)లోని మున్నేరు (Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజీవ్ స్వగృహ(Rajeev Swagruha)లో జరిగిన నష్టాన్ని ఖమ్మం కలెక్టర్ (Collector) ముజమ్మిల్‌ఖాన్ ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. అనంతరం కాల్వొడ్డు, బొక్కలగడ్డలో పడిపోయిన ఇళ్లను కేంద్ర బృందం తిలకించింది. ఈ సమయంలో అక్కడుకు చేరకున్న మహిళలు సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఖమ్మంలో మొత్తం రూ.729.68కోట్ల నష్టం జరిగిందని, ఆరుగురు మృతి చెందారని కలెక్టర్ నివేదిక అందించారు. అలాగే, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో వరద తాకిడితో నష్టపోయిన పంట పొలాలు, గండిపడిన చెరువును కేంద్రం బృం దం సభ్యులు పరిశీలించారు. చింతలపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, చెరువులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని రైతు (Farmers)లకు వారు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా మాను కోట జిల్లాలోని మరిపెడ, డోర్నకల్ మండలాల్లో బుధవారం రాత్రి వరద నష్టాన్ని పరిశీలించిన అధికారులు బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 40,697 ఎకరాల్లో పంట (Fields) నష్టం వాటిల్లిందని, 189 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా, మరమ్మతుల కోసం రూ.176.68కోట్లు అవసరమని ఆర్‌అండ్‌బీ అధ