Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme court:అత్యాచారం నిందితునికి మరణశిక్ష

— ఆరేళ్ల బాలిక అత్యాచారం కేసులు సంగారెడ్డి కోర్టు తీర్పు

Supreme court:ప్రజా దీవెన, సంగారెడ్డి: సంగారెడ్డి కోర్టు (sanga Reddy court)సంచలన తీర్పు విలువరిం చింది. ఆరేళ్ల బాలికపై అత్యా చారం చేసి, ఆపై హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష(death) విధించింది. నేరం రుజువు కావ డంతో కఠిన శిక్ష విధిస్తూ సంగారె డ్డిలోని ప్రత్యేక పో క్సో కోర్టు న్యా యాధికారి జయంతి (jayanthi)గురువారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబం ధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ (sp chennuru rupesh)విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీహా ర్‌లోని జమోయి జిల్లా సికిందర్‌ తాలూకాకు చెందిన గఫార్‌ అలీ ఖాన్‌(56) బీడీఎల్‌లో కూలీ పను లు చేస్తుండేవాడు. 2023 అక్టో బరు 16వ తేదీన సంగారెడ్డి(sanga Reddy )జిల్లా భానూరు బీడీఎల్‌కు చెందిన ఆరు సంవత్సరాల బాలికకు కూల్‌ డ్రిం క్‌లో మద్యం కలిపి తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచా రాని కి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరి కైనా చెబుతుందని భయపడి హ త్య (murder)చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు బీడీఎల్‌ భానూరు పోలీసులు వివిధ సెక్ష న్ల తో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల(sc, St acrt) నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. డీఎస్పీ పురు షోత్తంరెడ్డి దర్యాప్తు జరిపారు. పోలీసులు సమర్పించిన అన్ని ఆధారాలను పరిశీలించిన న్యా యాధికారి నిందితుడు గఫార్‌ అలీఖాన్‌కు మరణ శిక్ష విధించా రు. బాధితురాలి కుటుంబీకులకు పది లక్షల రూపాయల నష్ట పరి హారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదే శించారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ రూపేష్‌ హైకో ర్టును ఆశ్రయించి సత్వర విచారణ జరిగేలా అనుమతి తీసుకున్నారు. దీంతో కేవలం 11 నెలల్లోనే కోర్టులో విచారణ పూర్తయింది.