Kerijiwal: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: మద్యం పంపిణీ విధానంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై జెలు (jail)పాలైన ఢిల్లీ ముఖ్మమంత్రి అరవిం ద్ కేజ్రీవాల్ కు(aravind kejriwal)ఎట్టకేలకు ఊరట లభించింది. సుమారు ఆరు నెలల అనంతరం శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
దీంతో సీబీఐ (cbi)కేసులో కేజ్రీ వాల్ కు ఈ ఉపశమనం కల్పిం చింది. పది లక్షల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు(case) గురించి బయట మాట్లాడ వద్దని, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లరాదని, అధికారిక ఫైళ్లపై సంత కాలు చేయరాదని సుప్రీంకోర్టు (supreme court)స్పష్టంచేశారు.