Dr. Reddys Laboratories: ప్రజా దీవెన, హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రఖ్యాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం అందించింది. రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణ రెడ్డి (Dr. V. Narayana Reddy) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)ని శుక్రవారం కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.
సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డీస్ ల్యాబ్ వారిని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస రెడ్డిPonguleti Srinivasa Reddy), ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి (Mayor Gadwal Vijaya Lakshmi) సీఎం వెంట ఉన్నారు.