Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: కాంగ్రెస్ అణచివేత చర్యలకు పాల్పడుతోoది

— మాజీ మంత్రి కేటిఆర్

KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇందిరమ్మ (Indiramma) రాజ్యంలో కనీసం మీటింగ్‌ పెట్టుకునే పరిస్థితి లేదా..? అని మాజీ మంత్రి కేటీఆర్ (KTR ) ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్టులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కనీసం మీటింగ్‌ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అంటే ముఖ్యమంత్రి (Chief Minister) వెన్నులో ఎందుకంత వణుకు అని దాడి చేసిన కాంగ్రెస్‌ గూండాలను వదిలి, బీఆర్‌ఎస్‌ (BRS) నేతల అరెస్టులా అని నిలదీశారు.

సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ (Telangana) సమాజం గమనిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచి వేత చర్యలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ప్రతీ బీఆర్‌ఎస్‌ సైనికుడికి హృదయపూర్వక వందనం. బీఆర్‌ఎస్‌ నిజమైన బలం మన దృఢమైన క్యాడర్‌లో ఉందని మన కార్యకర్తులు మరోసారి నిరూపించారన్నారు. తెలంగాణ గౌరవాన్ని, అస్థిత్వాన్ని, భవిష్యత్తును అందరం కలిసి కాపాడుకుందామంటూ, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్వీట్‌ చేశారు.