NSS volunteers:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎంజియూ(MGU ) జాతీయ సాహస శిబిరాని (National Adventure Camp)కి వివిధ అంశాలలో ఎంపికలు నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 22 నుండి 31 వరకు ధర్మశాల(Dharamshala )లో నిర్వహించే జాతీయ సాహస శిబిరం – 2024 కు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీలను ఎంపిక చేశారు. ప్రతిభ చూపిన వారికి ఫిజికల్ ఫిట్నెస్, భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాంస్కృతిక అంశాల్లో (physical fitness, language skills, communication skills and cultural awareness) ఇంటర్వ్యూలు నిర్వహించి 10 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి (Maddileti) మాట్లాడుతూ.. విద్యతోపాటు సామాజిక సేవ చేసేందుకు ఎన్ఎస్ఎస్ చక్కటి వేదిక అన్నారు. ఎంపికైన విద్యార్థులను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఓఎస్డిటు విసి ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్ర మంలో పిఓలు స్రవంతి, హరిత, జ్యోతి, మేనేశ్వరి షేక్ సుల్తానా, ఆనంద్, వీరస్వామి, రవి, శేఖర్ ఎన్ఎస్ఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ పాల్గొన్నారు.
ఎంపికైన వాలంటీర్లు వీరే…
పురుషుల విభాగంలో …
1) బి శంకర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చండూరు.
2) ఎం నిరంజన్ నాగార్జున కళా శాల నల్లగొండ
3) ఎస్ నాగార్జున ఎస్ వి డిగ్రీ కళాశాల సూర్యాపేట
4) బి శ్యాంసుందర్, యూని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎంజియూ
5) ఏ వెంకటేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్
మహిళా విభాగంలో ..
1) పి రవళి టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి నల్లగొండ
2) జే సంధ్య టి టి డబ్ల్యూ ఆర్ డి సి దేవరకొండ
3) ఎల్ ప్రతిభ టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి భువనగిరి
4) ఆర్ కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాలియా
5) బి స్వాతి టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి సూర్యాపేట