–విధులకు ఆటంకం కలిగించి, వాహన అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదు
Anjaiah Yadav: ప్రజా దీవెన, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు అతని కుమారులు రవి యాదవ్, మురళి యాదవ్ లపై బి.ఎన్.ఎస్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేశంపేట్ పోలిసులు కేసులు నమోదు చేశారు.
గురువారం హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య రేగిన గొడవ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లతో పాటు మరికొంత మంది నాయకులను అదుపులోనికి తీసుకున్నారు. వాతావరణం చల్లబరిచేందుకు పోలిసులు వారిని హైదరాబాదు నుండి షాద్ నగర్ నియోజక వర్గంలోని కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మార్గ మద్యంలోని కొత్తపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారులు రవి యాదవ్, మురళి యాదవ్ లు తమ అనుచరులతో కలిసి పోలిసు వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక్క సారిగా మూకుమ్మడిగా దాడి చేసి బస్సు పైకి ఎక్కి అద్దాలు పగలగొట్టి పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బస్సు డ్రైవర్ దోనాదుల రమేష్ ఫిర్యాదు మేరకు వై రవి యాదవ్, మురళీ యాదవ్, నవీన్, జమాల్, లక్ష్మణ్, జగన్, బండ నిరంజన్, మల్లయ్య, సుధాకర్, వెంకట్ రెడ్డి, ధన్ రాజ్ రెడ్డి తో పాటు మరికొంత మందిపై క్రైమ్ నెంబరు 196/2024 ద్వారా బిఎన్ఎస్ యాక్ట్ 126, 132, 189/2, 191/2 r/w 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ (Anjaiah Yadav) పై..
కొత్తపేట గ్రామం నుండి బస్సులో బిఆర్ఎస్ (BRS) నాయకులను పోలిసులు అతి కష్టం మీద కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమయంలో షాద్ నగర్ (Shad nagar ) మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ (Anjaiah Yadav) తన కుమారులు రవి యాదవ్ (ravi Yadav), మురళి యాదవ్ (Murali Yadav)లు తమ అనుచరులతో కలిసి ముకు మ్మడిగా కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికి పోలీసులకు వ్యతి రేకంగా నినాదాలు చేశారని ఎఎస్ఐ నరసింహులు ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 197/2024 ప్రకారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తోపాటు అతని కుమారులు మురళి యాదవ్, రవి యాదవ్, వారి అనుచరులైన పలువురుపై సెక్షన్లు 126(2), 132, 189 r/w 190 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.