Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gold Price Today : బంగారానికి మళ్ళీ రెక్కలొచ్చా యి..ఆకాశం వైపు అడుగులు

Gold Price Today :ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బంగారం (gold)ధరలు పట్టాలపై రైలు వలె పరుగులు పెడుతున్నాయి. ఇటీవల నుంచి స్వల్పంగా దిగి వస్తున్న పసిడి ధరలు రెండు రోజుల నుంచి దూసుకుపోతు న్నాయి. బడ్జెట్‌ తర్వాత భారీగా పడిపోయిన బంగారం ధరలు ప్రస్తు తం భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల నుంచి స్వల్పంగా దిగి వస్తున్న పసిడి ధరలు రెండు రోజుల నుంచి దూసుకుపోతున్నాయి. బడ్జెట్‌ తర్వాత భారీగా పడిపోయిన బంగారం ధరలు (Gold Price) ప్రస్తుతం భారీగా పెరుగుతుండటంతో వినియోగదా రులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే తులం బంగా రంపై దాదాపు 1500 రూపాయల కుపైగా ఎగబాకింది. ఇక తాజాగా సెప్టెంబర్‌ 15వ కూడా భారీగానే పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 650 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజు లుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధర లకు మళ్లీ రెక్కలొచ్చాయి.

భారత దేశంలో బంగారానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. వివాహాది శుభకార్యాలకు పెద్ద ఎత్తున బం గారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం రేటు Gold Price మాత్రం రోజూ మారుతూనే ఉంటుంది. మార్కెట్‌లో గోల్డ్ డిమాండ్, అం తర్జాతీయ పరిణామాల (Gold demand, international developments) దృ ష్ట్యా గోల్డ్ రేట్లలో తేడాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజు లుగా బంగారం ధరల్లో కీలక కదలి కలు కనిపిస్తున్నాయి. గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడిన బంగారం ఇక సెప్టెంబర్ నెలలో స్వల్పంగా తగ్గుతూ వచ్చిం ది. కానీ రెండు రోజుల నుంచి మా త్రం మహిళలకు షాకిచ్చేలా పెరు గుతోంది.

దేశంలోని ఆయా ప్రధాన నగ రాల్లో బంగారం ధరలు

–చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండ గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.
–ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 ఉండ గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,040 ఉంది.

–హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,6 50 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

–విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

— కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

— బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68, 650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

ఇక వెండి ధరలు ఇలా… బంగారం (gold)బాటలో వెండి (silver)కొనసా గుతుంది. రెండు రోజుల కిందట 84000 ఉన్న వెండి ధర.. ప్రస్తుతం రూ.92,000లకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళ రాష్ట్రాల్లో మా త్రం కిలో వెండి ధర రూ.97, 000లకు చేరుకుంది.