AVM School Friends Association: ప్రజా దీవెన, శాలిగౌరారం: ఇటీవల గుండె పోటుతో మరణించిన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన ఆర్టిసీ కండక్టర్ వైద్యుల ప్రకాష్ తో కలిసి చదువుకున్న 1989 ఎస్ఎస్ సీ, ఇంటర్ 1991 ఏవిఎం స్కూల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (AVM School Friends Association) మిత్రులు,పూర్వ విద్యార్థులు కుంటుంబానికి అండగా నిలిచి లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం చేశారు.ప్రకాష్ అకాల మరణం తమకు తీరని లోటని, కుటుంబానికి అండగా ఉంటామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్ (Post Office) లో ఫిక్సిడ్ డిపాజిట్ (Fixed Deposit) చేసిన పత్రాన్ని 55 వేల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్బంగా ప్రకాష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు కొండ శ్రీనివాస్, షేక్ అయాజ్ అహ్మద్,షేక్ అజాజ్ అహ్మద్, రామకృష్ణ, బ్రహ్మదేవర రమేష్,వల్లాల మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్ అహ్మద్, మండల కాంగ్రెస్ పార్టీ అస్యక్షులు కందాల సమరం రెడ్డి, మాజీ ఎం పి టి సీ మాదగోని రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.