Reels Fever: ప్రజాదీవెన, హన్మకొండ: అక్కడా ఇక్కడా, లింగభేదం అనే తేడా లేకుండా యువతలో సెల్ఫీ (Selfie) పిచ్చి పెరిగిపోతోంది. సెల్ఫీలు దిగాలి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయాలి. వాటికి వచ్చే లైక్స్ (Likes)ను కామెంట్స్ (Comments)ను చూసి సంబరపడాలి ఇదే లక్ష్యంగా నేటి యువత ఒక్కోసారి తమ జీవితాలను సైతం పనంగా పెడుతున్నారు. ఇందుకోసం కొందరు ఎంత దూరమైనా ప్రమాదాల అంచున ప్రయాణిస్తున్నారు.
చివరికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రీల్స్ (Reels) మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో నేటి సమాజంలో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన కాజీపేట (Kajipeta) మండలం కడిపికొండ రాంనగర్ (Ramnagar) సమీపంలో ర్తేల్వే ట్రాక్ పై ఆగివున్న గూడ్స్ రైలు మీద ఎక్కి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్న క్రమంలో హై టెన్షన్ విద్యుత్ ఘాతానికి గురై 70% కాలిన గాయాలతో ఎంజీఎంకు 108లో తరలించారు.