Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IPS Suspend: ఆంధ్రప్రదేశ్ లో అటాడుకుందా ము.. రా..!?

— ముంబయి నటి కేసులో ముగ్గురు ఐపీఎస్ ల మెడకు ఉచ్చు
— జెత్వానీ అక్రమ అరెస్టు వ్యవహా రంలో ముగ్గురు ఐపీఎస్ ల ప్రమే యం
— ముగ్గురుని సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

IPS Suspend: ప్రజా దీవెన, విజయవాడ: ఆంద్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ (IAS) అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ముంబయి (Mumbai)కి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani)అక్రమ అరెస్టు వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలు అభియోగాలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్‌ అధికారి విశాల్‌గున్ని, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాలను సస్పెండ్‌ (Suspend) చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపిఎస్ లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను కాన్ఫిడెన్షియల్ స్టేటస్‌లో ప్రభుత్వం పెట్టింది. సర్వీస్ మెటర్‌కు సంబంధించి జీఏడీ జీఓ నెంబర్ 1590, 1591, 1592 లను కాన్ఫిడెన్సియల్ స్టేటస్ లో విడుదల చేసింది. కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టులో ముగ్గురు ఐపిఎస్ ల పాత్ర ఉన్నట్టు స్పష్టం చేసింది. విజయవాడ కమిషనరేట్‌(Vijayawada Commissionerate)లో డీసీపీగా ఉన్న సమయంలో విశాల్ గున్నీ జత్వానీ అరెస్టుకు ముందు సరైన విచారణ జరపలేదని ప్రభుత్వం పేర్కొంది.

నాడు జరిగింది ఇదే…

అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ పీఎస్ఆర్ ఆంజనేయులును కలిసి ఆయన మౌఖిక సూచనల మేరకు ముంబయికి వెళ్లి అరెస్టులు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఫిబ్రవరి 2న ఉదయం 6:30 గంటలకు నమోదు కాగా అంతకుముందే విశాల్ గున్నీ ఎలాంటి ముందస్తు పాస్‌పోర్ట్ లేకుండానే ముంబైకి వెళ్లారు. అంటే కేసు నమోదుకు ముందే ఆమె అరెస్టుకు పీఎస్‌ఆర్‌ ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన తన హోదా, అధికారాన్ని ఉపయోగించి, అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, పరిశీలన లేకుండానే దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్ల స్పష్టమైంది.

విఫలమైన విజయవాడ సీపీ..

మరోవైపు కేసు దర్యాప్తును సరిగ్గా పర్యవేక్షించడంలో విజయవాడ సీపీగా రానా విఫలమయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే తన అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారనే కారణంతో పీఎస్ఆర్ ఆంజనేయులపై చర్యలు తీసుకుంది. తప్పుడు కేసులో జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచే సిన వ్యవహారంలో కీలక పాత్రధారులుగా నాటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యం వీరికి ఉందని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబయికి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణనలోకి తీసుకొని, ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆది వారం వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లొద్దని వీరిని ఆదేశించారు.