Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MBBS Seats: ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెల్లడి

MBBS Seats: ప్రజా దీవెన, అమరావతి: ఏపీ (Andra pradesh)లో ఎంబీబీఎస్ (MBBS) ప్రథమ సంవత్సరం ప్రవేశాలు రాష్ట్రంలో 35 మెడికల్ కళాశాలలు 2024- 25 విద్యాసంవత్సరానికి వర్తించేలా సీట్ల కేటాయింపు ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా (Conniver quota) సీట్లను విడుదల చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) నేడు (సెప్టెంబరు 15) ఓ ప్రకటన చేసింది. ఏపీలో 35 మెడికల్ కాలేజీలు ఉండగా 2024-25 విద్యా సంవత్సరానికి వర్తించేలా కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించారు.

అన్ని మెడికల్ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు- 3,879

ప్రత్యేక కేటగిరీ సీట్లు- 267 (స్పోర్ట్స్, ఎన్ సీసీ, పీహెచ్ సీ, క్యాప్)

మొదటి విడత కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉండే సీట్లు- 3,612

వీటిలో కాలేజీల వారీగా భర్తీ అయిన సీట్లు- 3,507

మిగిలిన సీట్లు- 105

వీటిలో మైనారిటీ వర్గాలకు కేటాయించిన సీట్లు- 102

స్కౌట్స్ అండ్ గైడ్స్ కు కేటాయించిన సీట్లు- 3

కీలక తేదీలు…

ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన 3,507 మంది విద్యార్థులు

కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాల్సిన తేదీ- సెప్టెంబరు 19 (మధ్యాహ్నం 3 గంటల లోపు)

ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు- అక్టోబరు 1న ప్రారంభం