–సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం
Nellikanti Satyam: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భూమికోసం (land)భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాట ఫలితంగా నైజాం నవాబు దేశంలో విలీనమైన సెప్టెంబర్ 17న సిపిఐ (cpi) జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం (Nellikanti Satyam:) ఎగరవేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలం గాణ సాయుధ పోరాటం 4000 మంది అమరుల త్యాగాలతో ఎరుపెక్కిందని ఈ పోరాటం ఒక మ హోజ్వల చరిత్రని అన్నారు.
సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ విమోచనం (BJP redemption)పేరుతో సభలు పెట్టడం సిగ్గుచేటునున్నారు ఆనాడు నైజాముకు తొత్తులుగా ఉన్న భూస్వాములు జాగిర్దారులు దొరలు ప్రజల రక్త మాంసాలని పీల్చి పిప్పి చేసిన వారసులు బిజెపి పార్టీ అని అన్నారు సాయిధ పోరాట చరిత్రని పాఠ్యాంశంలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సాయుధ పోరాట దినాన్ని అధికారి కంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి (Senior leaders of CPI Mallepally Adireddy) జిల్లా పార్టీ సహయ కార్య దర్శి లోడింగ్ శ్రావణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపు వీర స్వామి పట్టణ కార్యదర్శి రమేష్ లెనిన్ ముత్యాలు పండరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.