Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rayapudi Venkata Narayana: నీ హయాంలో అంతా అవినీతే…

*పరామర్శలే తప్ప పది రూపాయల సాయం లేదు
*కమిషన్ కోసం కక్కుర్తి పడింది మీరు కదా
*దళిత బందులో నీ వాటా ఎంతో అందరికీ తెలుసు
*మచ్చలేని నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేయకు. వెంకటనారాయణ

Rayapudi Venkata Narayana: ప్రజా దీవెన,కోదాడ:కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి (Uttam, MLA Padmavathi Reddy)లను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపణలు చేయడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి వెంకట నారాయణ (Rayapudi Venkata Narayana)విమర్శించారు.మంగళ వారం కోదాడ పట్టణం లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు లబ్ధిదారుల విషయంలో ఎంత కమిషన్ తీసుకున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనీ ఎద్దేవా చేసారు.కమిషన్ కింగ్ కా పేరు గాంచిన మీరు మాట్లాడటం సిగ్గుచేటన్నారు .మీరుకమిషన్ల కోసం కక్కుర్తి పడటం వల్ల కోదాడ నియోజకవర్గంలో ఏ పని చేయటానికి కూడా కంట్రాక్టర్ లు ముందుకు రాలేదనీ ఈ విషయం తెలియదా అన్నారు.

వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల హెలికాప్టర్ (Helicopter)ఉపయోగించడం తప్ప విహారయాత్రలకు కాదన్నారు. విహార్ యాత్రల నైజం ఎవరిదో అందరికీ తెలుసనీ ఘాటుగా విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఉత్తమ్ దంపతులపై ఆరోపణలు తగవనీ హితవు పలికారు.ఇటీవల సంభవించిన వరదలపై ఉత్తమ కుమార్ రెడ్డి పంట నష్టం (Crop loss) అంచనా వేయించి రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు .ఉత్తమ్ దంపతులు ఆకాశంలో విహారయాత్రలు చేస్తున్నారని మాట్లాడటం తగదు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అధికారం దుర్విని చేశావు కోదాడ నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు . ఎమ్మెల్యే గా (mla)వుంది ముందు ఒక పోలీసు వాహనం కుయ్ కుయ్మంటూ తిరగటం ఎవరికి తెలియంది కాదన్నారు . నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఫ్లెక్సీలు డీజేలు పెట్టుకొని ఊరేగిన విషయం జనం మరవ లేదన్నారు.కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం చేస్తున్నవే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోదాడ నియోజకవర్గం ప్రజల నోరు కొట్టి సంపాదించిన సొమ్ములో కనీసం వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ అయినా ఇవ్వని మీరు మాట్లాడడం దొంగే దొంగ అన్న చందంగా ఉందన్నారు.