Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ginger Juice Benefits: అల్లం రసం తాగితే లాభాలే లాభాలు

Ginger Juice Benefits: మనకి అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. వాస్తవానికి అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులతో బాధపడేవారికి బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా కీళ్ల కదలికను కూడా పెంచుతాయి. ఇక గుండె సంబంధిత సమస్యలను కూడా బాగా సహాయ పడుతుంది. అలాగే అల్లం (Ginger) గుండెపోటు, స్ట్రోక్‌ల (Heart attacks and strokes) ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కానీ, ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగటం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటో మనం ఇప్పడూ తెలుసుకుందాం..

వాస్తవానికి అల్లం జీర్ణక్రియను (Digestion) మెరుగుపరచడంలో జీవక్రియను పెంచడంలో మనకి బాగా సహాయ పడుతుంది. ఆలాగే బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇక ప్రతి రోజూ అల్లం రసం తాగడం వల్ల కొవ్వు కణాల విచ్ఛిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అల్లం యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా లభిస్తాయి. అలాగే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతాయి.

అల్లంలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ (Anti-inflammatory, antioxidant) జీర్ణక్రియను ప్రోత్సహించే లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. అల్లంలో జింజెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారం మరింత సులభంగా విచ్ఛిన్నం కావడానికి శరీరం పోషకాలను గ్రహించడానికి బాగా సహాయపడుతుంది.

ఈ క్రమంలో అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు (Antioxidants)రోగనిరోధక శక్తిని పెంచడంలో అంటు వ్యాధుల బారినపడకుండా రక్షణగా ఉంటుంది. అలాగే అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా బాగా సహాయపడుతుంది. అలాగే టైప్ 2 మధుమేహం ఉన్నవారికి అల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. ముందుగా అల్లం జ్యూస్‌ (Ginger juice) తయారు కోసం అల్లం తోక్క తీసి, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని కావాల్సినన్ని నీళ్లుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం వడగట్టి రుచికి సరిపడా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్‌ చేసుకుంటే అల్లం జ్యూస్ తయారు అయ్యినట్టే. ఇక చలి కాలంలో వచ్చే చలి, దగ్గు, జలుబు (Cold, cough, cold) లకు అల్లం జ్యూస్ చక్కటి ఔషధం.