Purity-e-service programme: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానికకిట్స్ కళాశాలలో (Local Kits College)కోదాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత- ఈ- సేవ కార్యక్రమం (Purity-e-service programme) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కోదాడ పురపాలక సంఘం, కమీషనర్ శ్రీమతి రమాదేవి పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే పరిసరాల, పరిశుభ్రత ను అలవర్చుకోవాలని, అందుకు సమయం కేటాయించాలని కోరారు. విద్యార్థినులు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేయాలన్నారు.
నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా గ్రామం (My family, my region, my village)మరియు నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం పాటు పడాలని కోరారు. మన పరిసరాల పరిశుభ్రత తో అనేక వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు అన్నారు. విద్యార్థినులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటరు ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. గాంధీ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణా రావు, వివిధ విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, ఐజాజ్, స్రవంతి, అధ్యాపకులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది యాదగిరి,భవాని, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.